శ్రీకాళహస్తి: పట్టణంలో ద్రౌపతి సమేత ధర్మరాజుల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రసవత్తరంగా సాగిన దుర్యోధన దుశ్యాసన వధ
రసవత్తరంగా సాగిన దుర్యోధన, దుశ్శాసన వధ శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధ ఆలయమైన ధర్మరాజు స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో ప్రధాన ఘట్టమైన దుర్యోధన, దుశ్శాసన వధ అధ్యంతం రసవత్తరంగా సాగింది. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజారులు కురులు ముడివేశారు. భీముడు, దుర్యోధనుడు వేష దారులు యుద్ధం కళ్లకు కట్టినట్టుగా వేశారు. ఈ కార్యక్రమం వీక్షించడానికి శ్రీకాళహస్తి పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేశారు.