మంత్రాలయం: కోసిగి మండలంలో వైసీపీ నాయకులను పరామర్శించి భరోసా ఇచ్చిన మంత్రాలయం ఎమ్మెల్యే వై బాల నాగిరెడ్డి
కోసిగి:మంత్రాలయం ఎమ్మెల్యే వై బాల నాగిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మురళీమోహన్ రెడ్డితో కలిసి శుక్రవారం కోసిగి మండల వైసీపీ నాయకుడు నాడిగేని నరసింహులను ఆరోగ్య సమస్యలపై పరామర్శించారు. అనంతరం వందగల్ గ్రామ సర్పంచ్ కాల్వ లక్ష్మయ్య గారిని స్వగృహంలో కలసి కాలుకు జరిగిన ఆపరేషన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం భీమా కుటుంబం అండగా ఉంటుందని అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు. ఈయనతోపాటు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.