బీబీ నగర్: బీబీనగర్ చెరువుల దూకి యువకుడు ఆత్మహత్య ఎన్డిఆర్ఎఫ్ బృందంతో గాలింపు చర్యలు
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ లోని పెద్ద చెరువులో దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఈ ఘటనకు సంబంధించి శుక్రవారం సమాచారం తెలుసుకున్న అధికారులు ఎన్డీఆర్ఎఫ్ బృందంతో కలిసి గాలింపు చర్యలను చేపట్టారు. యువకుడి ఆచూకీ కోసం విస్తృతంగా ఎన్డిఆర్ఎఫ్ బృందంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు .ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.