మంత్రాలయం: ఆదోని జిల్లా సాధనే లక్ష్యంగా నిర్వహించే ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి: మంత్రాలయం జేఏసీ సభ్యులు
మంత్రాలయం:ఆదోని జిల్లా సాధనే లక్ష్యంగా నిర్వహించే ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జేఏసీ సభ్యులు ఎం.రాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం మంత్రాలయంలో వారు మాట్లాడుతూ మద్రాస్ రాజధాని ఉన్న కాలంలోనే మున్సిపాలిటీగా అవతరించిన ఆదోని నేటికీ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ప్రజలు గట్టిగా అడగకపోవడమే దీనికి ప్రధాన కారణమని ఆయన తెలిపారు. జిల్లా సాధనకు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరు పోరాడాలని కోరారు.