నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు పేట జిల్లా పోలీస్ శాఖ పరిధిలో గురువారం రాత్రి లోకల్ పోలీసులు ప్రత్యేక దళాలు ఆపరేషన్ చపుత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు కాలనీలో హోటల్ షాపు ల ముందు పబ్లిక్ స్థలాల వద్ద అనుమానాస్పదంగా గుమిగూడి యువతీ మహిళలకు అసౌకర్యం కలిగించేలా తిరుగుతున్న వారు పేట నుండి 26, మక్తల్ 18,మరికల్ 7,కోస్గిలో 5 మంది మొత్తం 56మంది యువకులను పోలీసులు గుర్తించి పట్టుకున్నారు.వారందరికీ మహిళల పట్ల గౌరవం ఈవ్ టీజింగ్ హరాస్మెంట్ పై చట్టపరమైన శిక్షలు బాధ్యత ప్రవర్తన భవిష్యత్తుపై ప్రభావం వంటి అంశాలపై వారి తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.