తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, తాడేపల్లిగూడెం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ దాఖలు చేశారు.తొలుత పెద్దఎత్తున మంత్రి కొట్టు సత్యనారాయణ నివాసం నుండి ఆర్డీవో కార్యాలయానికి నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. ఈ ర్యాలీకి పెద్దసంఖ్యలో అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలివచ్చారు.ర్యాలీ అనంతరం ఆర్డీవో, ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.చెన్నయ్యకు నామినేషన్ పత్రాలను సమర్పించారు.