నిర్మల్: హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల పూజలు
Nirmal, Nirmal | Jul 6, 2025 హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జామునుండే భక్తులు ఆలయాలకు చేరుకుని పూజలు జరిపారు. ఉదయం పంచామృతాలతో అభిషేకాలు చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు మాట్లాడుతూ.. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారని తెలిపారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించి మంచి పనులు చేపట్టే వారని భక్తులకు వివరించారు. అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు.