జడ్చర్ల: జడ్చర్ల నియోజకవర్గంలో ప్రచారం కొనసాగిస్తున్న పాలమూరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీ చందర్ రెడ్డి
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలమూరు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీ చందు రెడ్డి జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం బైరంపల్లి, కంచనపల్లి, దోనూర్ గ్రామాలలో తన ప్రచారాన్ని నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన మిడ్జిల్ మండలంలో తనప్రచారాన్ని కొనసాగిస్తున్నానని పాలమూరు పార్లమెంటు నియోజకవర్గాలలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధియే ధ్యేయంగా పనిచేస్తున్నారని ప్రజలకు ఇచ్చినమాట నిలబెట్టుకునేందుకు పాలమూరు పార్లమెంటు స్థానాన్నికాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు