కాగజ్నగర్: తమ జీతాలు చెల్లించాలంటూ కాగజ్నగర్ మున్సిపల్ కార్మికుల బిక్షాటన
కాగజ్నగర్ మున్సిపాలిటీ కార్మికులు బుధవారం వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా కార్యాలయం నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి భిక్షాటన చేశారు. CPM పట్టణ కార్యదర్శి ముంజం ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. 4నెలల నుంచి వేతనాలు అందక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మున్సిపల్ కమిషనర్ల నిర్లక్ష్యంగా వారికి సరైన సమయానికి వేతనాలు అందడం లేదన్నారు.