శ్రీశైలంలో భారీగా భక్తుల రద్దీ కొనసాగుతుంది .స్వామి అమ్మవార్ల దర్శనానికి ఐదు గంటల సమయం పడుతుంది అని అలయా EO శ్రీనివాసరావు తెలియజేశారు.ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో శ్రీశైలం చేరుకొని స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.భక్తుల కొరకు, అల్పాహారం, మంచినీరు బిస్కెట్ల అందజేస్తున్నారు.అధికారులు మరోవైపు భక్తుల రద్దీ దృష్ట్యా కేవలం అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నామని ఈవో శ్రీనివాసరావు తెలియజేశారు.