పెద్దపల్లి: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పెద్దపల్లి జిల్లా కేంద్రం చెందిన వ్యక్తికి చోటు. అభినందించిన పట్టణ ప్రజలు
సంగీత వాయిద్యమైన కీబోర్డ్ లో అత్యుత్తమ ప్రతిభను కనబరచి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పెద్దపల్లి పట్టణానికి చెందిన చెందినబోయిని ప్రసాద్ స్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఈ బృందంలో వీరి ప్రతిభను గుర్తించిన వరల్డ్ రికార్డు ప్రతినిధులు ఆనంద్ రాజన్, హలేలు మ్యూజిక్ పాఠశాల వ్యవస్థాపకులు అగస్టీన్ దండింగి ఏప్రిల్ 14 న సర్టిఫికేట్ తో పాటు మెడల్ అందించారు. ఈ ఘనత సాధించిన బోయిని ప్రసాద్ ను కుటుంబ సభ్యులు, పట్టణ ప్రజలు తదితరులు అభినందించారు.