జగిత్యాల: తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ పూర్వ వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతోనే బిఆర్ఎస్ రజితోత్సవ సభ నిర్వహించడం జరిగింది : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
బిఆర్ఎస్ రజితోత్సవ సభ సక్సెస్ చేసిన కార్యకర్తలకు నాయకులకు మద్దతుదారులకు ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం సాయంత్రం 6గంటల ప్రాంతంలో జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా జడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ తో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు .ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ సభకు అడ్డంకులు కల్పించినప్పటికీ పోలీసులు సహకరించకున్నా గాని సభ విజయవంతం అయ్యిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ పూర్వ వైభవం తీసుకురావాళ్లన్న లక్ష్యంతోనే బిఆర్ఎస్ రజితోత్సవ సభ నిర్వహించడం జరిగిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం, మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యతిరేక విధానాలపై ప్రజలు చూపిస్తున్నటువంటి వ్యతిరేకత ఈ సభ ద్వారా తెలుస్తుందని అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు జగిత్యాల రూరల్ అర్బన్ మండల అధ్యక్షులు ఆనంద్ రావు తుమ్మ గంగాధర్ మాజీ జడ్పీటీసీ జలంధర్ చందోలి పాక్స్ చైర్మన్ మాధవ రావు పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు పట్టణ ఉప అధ్యక్షులు వొళ్ళేం మల్లేశం నాయకులు వెంకటేశ్వర్ రావు గంగారెడ్డి రిజ్వాన్ ప్రతాప్ సన్నిత్ రావు ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.