శ్రీకాకుళం: విద్యుత్ ఛార్జీలు పెంచిన పాపం వైస్ జగన్ రెడ్డిదే: పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావ్
గడచిన 5 ఎల్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో వైస్ జగన్ చేసిన అవినీతి వలనే రూ 1,29,000 కోట్ల విద్యుత్ బారాలు రాష్ట్ర ప్రజలపై పడ్డాయని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావ్ విమర్శించారు. ఆదివారం పాతపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద టీడీపీ నాయకులతో కలసి సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావ్ మాట్లాడుతూ విద్యుత్ చార్జీలు వారే పెంచి, వారే ధర్నాలు చేయడం ప్రజలను మోసం చేయడం కాదానని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు చేసిన పాపాన్ని కూటమి ప్రభుత్వంపై బురద జల్లడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించి నట్టుందని అన్నారు.