కళ్యాణదుర్గం: గూళ్యం గ్రామంలో విషాదం, బీటెక్ విద్యార్థి చరణ్ (19) పొలంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య, దర్యాప్తు చేపట్టిన పోలీసులు
కంబదూరు మండలం గూళ్యం గ్రామంలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గోవిందు సునీత దంపతుల కుమారుడు చరణ్ (19) పొలంలో చెట్టు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చరణ్ అనంతపురంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. కొడుకు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వినిపించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.