పాణ్యం: నన్నూరులో అగ్నిప్రమాదం షార్ట్‌సర్క్యూట్‌తో భారీ ఆస్తినష్టం
ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో చాంద్ ఇంట్లో రేకుల షెడ్‌లో కరెంట్ షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రూ.1,40,000 నగదు, ఫ్రిజ్, కూలర్, వాషింగ్ మిషన్, కుట్టుమిషన్, దుస్తులు, బియ్యం బస్తాలు పూర్తిగా కాలిపోయాయి. ఘటన స్థలాన్ని తహసీల్దార్ విద్యాసాగర్ పరిశీలించి నష్టపరిహారం అందజేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బీసీ ఉపాధ్యక్షుడు తలారి విజయుడు, శంషుద్దీన్, హుస్సేన్ సర్కార్, కటిక హాసన్ తదితరులు అక్కడ ఉన్నారు.