గుంతకల్లు: గుత్తి మండలం జక్కలచెరువు గ్రామంలో బైక్ అదుపు తప్పి బోల్తా, ఇద్దరికి తీవ్ర గాయాలు, అనంతపురం తరలింపు
అనంతపురం జిల్లా గుత్తి మండలం లోని జక్కలచెరువు గ్రామ శివారులో 67వ నంబర్ జాతీయ రహదారిపై ద్విచక్రవాహనం అదుపు తప్పి బోల్తా పడి ఓ మహిళ, యువతికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుత్తి మండలంలోని జక్కలచెరువు గ్రామానికి చెందిన బాల నాగమ్మ, గౌతమి ఇద్దరు గ్రామ శివారులో ఉన్న పొలంలో వ్యవసాయ పనులకు వెళ్లి అనంతరం ఇద్దరు ద్విచక్రవాహనంలో ఇంటికి బయలుదేరారు. వారు వెళ్తున్న బైక్ వేగంగా వెళ్తూ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.