మంత్రాలయం: కోసిగి లోని ఏపీ మోడల్ స్కూల్లో విద్యార్థులకు భూసార పరీక్షలపై అవగాహన కార్యక్రమంలో నిర్వహించిన ఏవో
కోసిగి: మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూల్లో మంగళవారం SSHP పథకం కింద నేల ఆరోగ్యం, భూసార పరీక్షల ఆవశ్యకత, మట్టి నమూనాలను తీసే పద్ధతిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో వరప్రసాద్ మాట్లాడుతూ మొక్కల పెరుగుదలకు, పంట నాణ్యతకు ఎరువుల సమతుల్యత పాటించాలని అన్నారు. అందుకు మట్టి పరీక్షలు చేయించుకొని, తదనుగుణంగా ఎరువులను వినియోగించాలని సూచించారు. దీనిపై విద్యార్థులు కూడా అవగాహన కలిగి ఉండాలని ఆయన కోరారు.