పాణ్యం: ఓర్వకల్లు జూనియర్ కళాశాల హాండ్స్ సంస్థ ఆధ్వర్యంలో ఎయిడ్స్ దినోత్సవ మానవహారం ర్యాలీ
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఓర్వకల్లు గవర్నమెంట్ జూనియర్ కళాశాల–హాండ్స్ స్వచ్చంద సేవ సంస్థ ఆధ్వర్యంలో మానవహారం ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఎయిడ్స్ నియంత్రణ విభాగం సహకారంతో జరిగిన ఈ ర్యాలీని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అధికారులు డాక్టర్ దాదా, డాక్టర్ నికిత ప్రారంభించారు. విద్యార్థులు కాలేజీ నుండి సిఎచ్సి వరకు ర్యాలీగా సాగి, హెచ్ఐవి–ఎయిడ్స్ నివారణపై ప్రతిజ్ఞ చేశారు. IEC కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ దాదా హెచ్ఐవి గురించి అవగాహన కల్పిస్తూ నివారణ చర్యలు, అందుబాటులో ఉన్న చికిత్స, బాధితులపై వివక్ష చూపకూడదని సూచించారు. ప్రిన్సిపాల్ ఎస్.వి.ఎస్ గురువయ