రోడ్డుపై చాపల అమ్మకాలతో లింగాల గట్టు వద్ద వద్ద భారీగా ట్రాఫిక్ జామ్, మూడు కిలోమీటర్ల మేరా నిలిచిపోయిన వాహనాలు,
శ్రీశైలం లింగాల గట్టు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.లింగాల గట్టు గ్రామం నుంచి పెద్ద బ్రిడ్జి వరకు ఇరువైపుల వాహనాలు, నిలిచిపోయాయ, శ్రీశైలం–హైదరాబాద్ వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారిపై చేపల వ్యాపారాలు అడ్డంగా నిర్వహించడంతో వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోయింది.దీంతో సుమారు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు. 🚦