మధిర: పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు
ముదిగొండ నుంచి వల్లభి వరకు నాలుగు లైన్ల రహదారి అభివృద్ధి పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లతో కలిసి గురువారం శంకుస్థాపన చేసారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ముదిగొండ పట్టణ పరిధిలో ముదిగొండ నుంచి వల్లభి వరకు 5 కిలో మీటర్ల మేరకు ప్రస్తుతం ఉన్న రెండు లైన్ల రహదారిని 28 కోట్ల రూపాయల ప్లాన్ నిధుల అంచనా వ్యయంతో నాలుగు లైన్ల రహదారిగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ నిధులతో రహదారి విస్తరణతో పాటు డ్రైనేజి, ఫుట్ పాత్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.