డబ్బులు చెల్లిస్తానని చెప్పి, కట్టర్ బ్లేడ్ తో గొంతు కోశాడు : బాధితుడు కళ్యాణ్ చక్రవర్తి
Anantapur Urban, Anantapur | Dec 27, 2025
తాను అందించిన అప్పుల డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పడంతో అనంతపురం నగరంలోని రామ్ నగర్ అయ్యప్ప స్వామి ఆలయం వద్దకు వెళ్లానని అయితే ఒక్కసారిగా తన గొంతును కట్టర్ బ్లేడుతో కోసినట్లుగా బాధితుడు కళ్యాణ్ చక్రవర్తి మీడియాకు వివరాలను వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం అత్యవసర వైద్య విభాగంలో మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.