బొమ్మనహాల్ మండలంలోని కురవల్లి గ్రామంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గురువారం తెల్లవారుజాము ఎస్ఐ నభిరసూల్ ఆధ్వర్యంలో సిబ్బంది గ్రామంలో అనుమానిత ప్రదేశాలు జల్లెడ పట్టారు. గడ్డివాములు, పశువుల పాకలు తనిఖీ చేశారు. రౌడీ షీటర్ల ఇళ్లలో సోదాలు చేశారు. గ్రామ వీధుల్లో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.