కనిగిరి: చంద్రశేఖరపురం మండలం తుంగోడు ఘాట్ రోడ్డులో అదుపుతప్పి లోయలో పడ్డ కారు, వ్యక్తి అక్కడికక్కడే మృతి
చంద్రశేఖరపురం: కారు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చంద్రశేఖరపురం మండలం తుంగోడు ఘాట్ రోడ్డులో సోమవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కురిచేడు మండలానికి చెందిన 25 సంవత్సరాల విష్ణు భార్గవ్ జనవరి నెల 17వ తేదీన తిరుమలనాథ స్వామి తిరునాళ్ల నిమిత్తం కొండపల్లికి కారులో వెళ్ళాడు. తిరిగి వస్తున్న క్రమంలో చంద్రశేఖరపురం మండలం తుంగోడు ఘాట్ రోడ్లో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విష్ణు భార్గవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న చంద్రశేఖరపురం ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.