అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం పరిధిలోని శంకరబండ గ్రామంలో బుధవారం ఎద్దు పొడిచి మహిళ రైతు నారాయణమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. శంకరబండ గ్రామానికి చెందిన నారాయణమ్మ అనే మహిళ రైతు పాడి పశువులతో పాటుగా వ్యవసాయం కోసం పశువులను కొనుగోలు చేసి జీవనం సాగిస్తూ ఉండేది. ఈ క్రమంలో ఎద్దుకు మేత పెట్టేందుకు తీసుకెళ్తున్న సమయంలో ఒక్కసారిగా బెదిరి నారాయణమ్మను ఎత్తి పైకి విసిరింది. దీంతో తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేస్తున్నారు.