గద్వాల్: ప్రభుత్వ విధానాల రూపకల్పనలకు ఖచ్చితమైన డేటా కీలకం: ప్రణాళికధికారి యోగానంద్
ప్రభుత్వ విధానాల రూపకల్పనకు ఖచ్చితమైన డేటా కీలకమని, ప్రతి వివరాన్ని నిష్పక్షపాతంగా, సమగ్రంగా నమోదు చేయాలని ముఖ్య ప్రణాళికాధికారి యోగానంద్ అన్నారు. శనివారం సాయంత్రం ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు 2023–2024 వ్యవసాయ సంవత్సరానికి సంబంధించిన 7వ చిన్న తరహా నీటి వనరుల గణన మరియు 2వ వాటర్ బాడీస్ గణనను జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.