రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటాపూల్ వద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి జునైద్ దారుణ హత్యకు గురైన ఘటన బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో తలెత్తిన కక్షతో గుర్తుతెలియని దుండగులు రియల్ ఎస్టేట్ వ్యాపారిని కత్తితో పొడిచి హత్య చేసినట్లుగా తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.