కుప్పం: విజలాపురం జిల్లా పరిషత్ పాఠశాలలో మాక్ పార్లమెంట్
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని విజలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల్లో ప్రజాస్వామ్య అవగాహన పెంపొందించేందుకు మాక్ పార్లమెంట్ నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు స్వయంగా ఎంపీలు, మంత్రుల పాత్రలు పోషించి పార్లమెంట్ కార్యకలాపాలను ప్రదర్శించారు. సభా నియమాలు, చర్చా పద్ధతులను వివరించి, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.