విశాఖరాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణ, వాటి కార్యకలాపాలు, పనితీరు, అకౌంట్ల ఆడిటింగ్ పై పరిశీలనకు ఉభయ సభల సభ్యులతో ఏర్పాటైన లెజిస్లేచర్ కమిటీ జిల్లా పర్యటనను శుక్రవారం ప్రారంభించింది. ఆమదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న ఈ కమిటీ శుక్రవారం ఉదయం జిల్లాకు చేరుకొని కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యింది. ఛైర్మన్ కూన రవికుమార్‌తో పాటు కమిటీలో సభ్యులుగా వున్న శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కాంట్రాక్టర్ ఐజాక్ బాషా, తదితరులు పాల్గొన్నారు.