దేవరకద్ర: చిన్న రాజమూరు,పెద్దరాజమురు గ్రామాలలో వర్షానికి దెబ్బతిన్న వరి పంటను పరిశీలించిన వ్యవసాయ అధికారులు...
దేవరకద్ర మండల పరిధిలోని చిన్న రాజమూరు,పెద్ద రాజమూరు గ్రామాలలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా దెబ్బతిన్న వరి పంటలను శనివారం సాయంత్రం ఐదు గంటలకు వ్యవసాయ శాఖ అధికారులు సందర్శించారు.వర్షాలకు పాడైపోయిన వరి పంటను పరిశీలించి ఈ విషయాన్ని పై అధికారులకు సమాచారం అందించి రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని ఏవో రాజేందర్ అగర్వాల్ తెలిపారు.అంతేకాకుండా నష్టపోయిన పంటకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట విస్తీర్ణ అధికారులు,రైతులు పాల్గొన్నారు.