పెద చెల్లోపల్లి మండలంలోని గుంటుపల్లి గ్రామంలో బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ సోమవారం పర్యటించారు. బోట్ల గూడూరులో గుంటుపల్లి కి చెందిన మహర్షి అని ఆటో డ్రైవర్ పై దాడి జరిగిన నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని రామచంద్ర యాదవ్ ఉప్పరామర్శించారు. అనంతరం మీడియాతో రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ... బీసీలపై ఇటీవల దాడులు ఎక్కువయ్యాయన్నారు. ఇదే రీతిలో దాడులు కొనసాగితే భవిష్యత్తులో టిడిపి బంగాళాఖాతంలో కలుస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును హెచ్చరిస్తున్నామని అన్నారు. బీసీ అయిన మహర్షి పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీని కోరుతున్నట్లు రామచంద్ర యాదవ్ తెలిపారు.