అనంతపురం నగర శివారులోని రూరల్ మండల పరిధిలో ఉన్న సొముల దొడ్డిలో ప్రమాదవశాత్తు ఇటుక పెళ్ళ పడడంతో తేజ అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఆమెను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.