భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటలకు కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. కర్నూలులోని బి. క్యాంప్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును డీఈవో శామ్యూల్ పాల్ పరిశీలించారు. 4,124 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 3,960 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 164 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు పేర్కొన్నారు.