ఘన్పూర్ స్టేషన్: స్టేషన్ ఘన్ పూర్ : రఘునాథపల్లి మండలంలోని అమ్మ ఆదర్శ పాఠశాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్
రఘునాథపల్లి మండలంలోని గోవర్ధనగిరి, ఖిలాషాపూర్, కుసుంబాయి తండా గ్రామాల్లో తాగునీటి వసతులు, అమ్మ ఆదర్శ పాఠశాల పనులను స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ ఫింకేష్ కుమార్ గురువారం మధ్యాహ్నం 1:00 కు ఆకస్మిక తనిఖీ చేశారు.వేసవికాలం దృష్ట్యా తాగునీటి అందించే వనరులను పరిశీలించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా గుర్తించిన పనులను తనిఖీ చేసి బడ్జెట్ అంచనా వేయడానికి సంబంధించి సిబ్బందికి తగిన సూచనలు అందించారు. మరమ్మతులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.