కొత్తకోట: వ్యవసాయ యోగ్యమైన భూమి కలిగిన రైతులకు రైతు భరోసా లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యం: కలెక్టర్ ఆదర్శ్ సురభి
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం అర్హుల ఎంపిక కోసం జరుగుతున్న సర్వే విషయమై ఆదివారం కొత్తకోట మున్సిపాలిటీ కార్యాలయంలో ఆదివారం ఉదయం 11 గంటలకు కలెక్టర్ మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలోని దండుగడ్డ ప్రాంతంలో వ్యవసాయ యోగ్యం కానీ భూములను, ఇప్పటికే లే అవుట్లుగా మారిన భూములను తహసిల్దార్, మున్సిపల్ కమిషనర్, వ్యవసాయ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించారు.