ఒంగోలు: స్థానిక సుజాతనగర్‌లో యోకోహోమా టైర్ల షోరూమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే బాలినేని
నగరంలోని సుజాతనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన యోకో హోమా టైర్ల షోరూమ్‌ను ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. వినియోగదారుల మన్ననలను పొందుతూ మంచి సంస్థగా గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ సుజాత పాల్గొన్నారు.