కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని చెన్నూరు మండలం చెన్నూరులో బుధవారం రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పి.రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రెవేటికరణ కు వ్యతిరేకంగా వైయస్సార్ సిపి రాష్ట్ర అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన కోటి సంతకాల సేకరణ లో సంతకాలు సేకరించారు.కమలాపురం నియోజకవర్గం పరిశీలకులు రెడ్యం వెంకట సుబ్బారెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలల కాలం కావస్తున్న ఒక్క పథకం అమలులో లేదన్నారు.