వారసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకున్న ఘటన సోమవారం మధ్యాహ్నం జరిగింది. బాపూజీ నగర్ లో నివాసముంటున్న పవిత్ర అనే యువతిని సమీప బంధువు ఉమాశంకర్ కత్తితో గొంతులో పొడిచి దారుణంగా హత్య చేశాడని టైల్స్ పనిచేసే ఉమాశంకర్ తాగుబోతు కావడంతో యువతి పెళ్లికి ఒప్పుకోలేదని కక్షపెంచుకున్న అతడు ఉన్మాదిగా మారి హత్య చేశాడని యువతీ తల్లిదండ్రులు తెలిపారని అన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.