కృత్రిమ కొరత సృష్టిస్తూ సిగరెట్లను MRP కంటే ఎక్కువ ధరలకు విక్రయించే డీలర్లు, ఏజెన్సీలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని లీగల్ మెట్రాలజీ ఇనిస్పెక్టర్ శంకర్ హెచ్చరించారు. బుధవారం రాయదుర్గంలో వే 2 న్యూస్ ప్రతినిధితో ఆయన మాట్లాడారు. బళ్లారి నుండి సరఫరా అయ్యే బియ్యం సంచులపై 26 కిలోలుగా ముద్రించి 25 కిలోలు నింపి అమ్ముతున్నట్లు గుర్తించామని పట్టుబడితే భారీజరిమానాలు తప్పవని వ్యాపారులను హెచ్చరించారు.