రాబోవు ఎన్నికల నేపథ్యంలో వడ్డిపల్లి గ్రామంలో నేరాల నియంత్రణ పై ప్రజలకు అవగాహన కల్పించిన సీఐ బి. రాఘవ రెడ్డి
వాల్మీకిపురం మండలం వడ్డిపల్లి మరియు జర్రావారి పల్లి గ్రామాలను సీఐ బి.రాఘవ రెడ్డి, ఎస్ఐ చంద్రశేఖర్ సోమవారం సందర్శించారు. దిత్వా తుఫాన్ నేపథ్యం లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్ కు సంబంధించి ఎవరు కూడా పంతాలకు పోకుండా పోలీసులకు సహకరించాలన్నారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కేసులు తప్పవని హెచ్చరించారు. నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణ పై అవగాహన కల్పించారు.