రాజేంద్రనగర్: షాద్నగర్ పోలీస్ స్టేషన్ లో ఐఏఎస్ అధికారిని స్మిత సబర్వాల్ పై వికలాంగుల నాయకుల ఫిర్యాదు
షాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వికలాంగులను కించపరిచే విధంగా పోస్ట్ పెట్టిన ఐఏఎస్ అధికారిని స్మిత సబర్వాల్ ఫై చర్యలు తీసుకోవాలని కోరుతూ షాద్నగర్ పోలీస్ స్టేషన్లో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షుడు భుజంగ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఏఎస్ అధికారిని స్మిత సబర్వాల్ వికలాంగులను కించపరుస్తూ సిగ్గుచేటని వెంటనే వికలాంగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.