భూపాలపల్లి: యూరియా కోసం అర్ధరాత్రి నుంచి క్యూ లైన్ లో వేచి చూస్తున్న రైతులు
భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండల కేంద్రంలోని పిఎసిఎస్ గోదాం ముందు సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట నుంచి యూరియా కోసం రైతులు క్యూ లైన్ లో వేచి చూస్తున్న సంఘటన చోటుచేసుకుంది ఉదయం 5 గంటలకు పిఎసిఎస్ గోదాం తెరిచిన అధికారులు 400 మంది రైతులకు టోకెన్లు ఇచ్చారని వేల మంది రైతులు వచ్చినప్పటికీ యూరియా అందించడం లేదని ఉదయం 5 గంటలకు కార్యాలయం తెరిచినప్పటికీ ఇప్పటివరకు యూరియా ఇవ్వటం లేదని రైతులు ఆందోళనకు దిగారు,పోలీసులు చేరుకొని రైతులకు నచ్చ చెప్పారు,ఒక్కసారిగా పిఎసిఎస్ గోదాం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే సరిపడ యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.