నారమాకుల మిట్ట వద్ద టమోటాలు తరలిస్తున్న ఆటో బోల్తా ఇద్దరికి తీవ్ర గాయాలు
నారమాకుల మిట్ట వద్ద టమోటాలు తరలిస్తున్న ఆటో మంగళవారం ఉదయం బోల్తా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కేవీపల్లె మండలం నారమకుల మిట్ట వద్ద పీలేరు-సుండుపల్లి మార్గంలో టమోటాలు తరలిస్తున్న మినీ ప్యాసింజర్ ఆటో టైర్ పగలడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ బి.మల్లికార్జున (40), ఎన్.ఎర్రం రెడ్డి (60), తీవ్రంగా గాయపడ్డారు.స్థానికులు వీరిని 108 ద్వారా పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు