మంత్రాలయం: పత్తి కొనుగోళ్లకు సంబంధించిన సిసిఐ నిబంధనలను సడలించాలి: సిపిఎం డిమాండ్
పెద్ద కడబూరు:పత్తి కొనుగోళ్లకు సంబంధించిన సీసీఐ నిబంధనలను సడలించాలని డిమాండ్ చేస్తూ సోమవారం పెద్దకడబూరులోని మండల పరిషత్ కార్యాలయం వద్ద అధికారులకు సీపీఎం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం కార్యదర్శి తిక్కన్న మాట్లాడుతూ, రైతులు పండించిన పత్తిని నిబంధనలకు అతీతంగా కొనుగోలు చేయాలన్నారు. ఉల్లి పంటకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.