ఆత్మకూరు మండలం ముష్టపల్లె గ్రామానికి చెందిన శివచరణ్ అనే యువకుడు ఉన్నత చదువులు అభ్యసిస్తూనే వ్యవసాయ రంగంలో వినూత్న పద్ధతులు అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. డిగ్రీ విద్యాభ్యాసం కొనసాగిస్తున్న శివచరణ్, తన తండ్రి శివసేగర్ నాటిన మహాగని మొక్కలను సంరక్షిస్తూ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నాడు. మహాగని మొక్కల కొమ్మల కత్తిరింపును (ఫ్లూటింగ్) పాత పద్ధతుల్లో నిచ్చెనలతో చేయాల్సి వచ్చేది. అయితే, శివచరణ్ ఆ విధానాన్ని మార్చి ఆన్లైన్లో ఆధునిక కట్టర్లను తెప్పించి, వాటికి మరో 15 అడుగుల పైపును బిగించి కింద నుంచే సురక్షితంగా కొమ్మల కత్తిరింపు చేసే విధానాన్ని అమలు చేస్తున్నాడు.