కర్నూలు: కర్నూల్ లో దాడి కేసులో ఇద్దరికీ ఏడాది జైలు
దాడి కేసులో కర్నూలుకు చెందిన పిడతల వెంకటస్వామి, పిడతల లక్ష్మీదేవి అనే ఇద్దరికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.2018లో ఉప్పరి లక్ష్మీదేవిపై దాడి చేసి వేధింపులకు పాల్పడ్డారని వచ్చిన ఫిర్యాదు మేరకు 3వ టౌన్ పోలీస్ స్టేషన్ నమోదు చేసిన కేసు విచారణ పూర్తయి నేరం రుజువైన నేపథ్యంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కోర్టు జడ్జి అనిల్‌కుమార్ శిక్ష ఖరారు చేశారు.కేసు విచారణ వేగవంతం కావడానికి ఏపీపీ గోపాలకృష్ణ బలమైన వాదనలు వినిపించగా, సాక్షులను సమయానికి కోర్టులో ప్రవేశపెట్టిన కానిస్టేబుల్స్ తిక్కస్వామి, జాన్సన్‌లను ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు.