గంట్యాడ మండలం తాటిపూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన పోలీస్ అవుట్ పోస్ట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ముస్తాబు అవుతోంది. తాటిపూడిలో గతంలో ఉన్న పోలీస్ ఔట్ పోస్ట్ భవనం పూర్తిగా శిథిలమైంది. ఈ నేపద్యంలో విజయనగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో గంట్యాడ ఎస్ ఐ సాయి కృష్ణ దగ్గరుండి పోలీస్ అవుట్ పోస్ట్ నూతన భవనాన్ని నిర్మించారు. త్వరలోనే ఇది ప్రారంభం కానుంది.