యువత క్రీడల వైపు మక్కువ పెంచుకోవాలని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి శుక్రవారం సూచించారు. సీఎంఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో ఆయన స్వయంగా బ్యాట్ పట్టి క్రికెట్ ఆడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉత్సాహం పెరుగుతుందని అన్నారు. ఆటల ద్వారా కొత్త స్నేహబంధాలు ఏర్పడతాయని, యువతలో స్నేహపూరిత వాతావరణం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ప్రత్యేకంగా 70 సంవత్సరాలు దాటిన వయసులోనూ చురుకైన ఆటతీరుతో మల్లారెడ్డి ప్రదర్శించిన ఫిట్నెస్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.