భూపాలపల్లి: లంబాడ కులస్తుల ఆరాధ్య పండుగ తీజ్ : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకుంటపల్లి గ్రామంలో గురువారం ఉదయం 8 గంటలకు లంబాడ కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన తీజ్ పండుగ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే గండ్ర. అనంతరం గ్రామ యువతులతో కలిసి నృత్యం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ తీజ్ పండుగ లంబాడ కులస్తుల ఆరాధ్య పండుగని ప్రతి సంవత్సరం తీజ్ వేడుకల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు.లంబాడ కులస్తుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని,ఇప్పటికే సంక్షేమ పథకాలు అందిస్తున్నామని రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు.