చిట్టమూరు మండలం యాకసిరితిప్పపై ఉన్న గౌరీ సమేత భూపతేశ్వర స్వామి ఆలయంలో కార్తీకపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు.కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వాహకులు ఆలయంలో ఆకాశదీపం వెలిగించారు.