ప్రజారోగ్యంతో చీరాల అభిరుచి రెస్టారెంట్ చెలగాటం, మాంసం వ్యర్ధాలు డ్రైన్లోకి విడుదల, దుర్గంధం వ్యాప్తి <nis:link nis:type=tag nis:id=localissue nis:value=localissue nis:enabled=true nis:link/>
చీరాలలో అభిరుచి రెస్టారెంట్ నిర్వాహకులు మిగిలిపోయిన మాంసం వ్యర్ధాలను సైడ్ డ్రైనేజీ లోకి పంపించడం వలన ఆ ప్రాంతమంతా విపరీతమైన దుర్గంధం వ్యాపిస్తోంది.ప్రతి మూడు రోజులకు ఒకసారి నిలిచిపోయిన వ్యర్ధాలను మునిసిపల్ పారిశుధ్య కార్మికులు నడుములోతు దిగి తొలగించి అక్కడే వదిలేస్తున్నారు.మునిసిపల్ అధికారులు వెంటనే ఈ సమస్యపై దృష్టి సారించాలని దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్ శనివారం డిమాండ్ చేశారు.